యమునలో స్నానం చేస్తుండగా వీడియోలు తీశారని విషం తాగిన ఇద్దరు బాలికలు
- యూపీలో చిత్రకూట్ జిల్లాలో యమునా నది వద్ద ఘటన
- కుటుంబ సభ్యులు మందలించడంతో బాలికల మనస్తాపం
- నిందితుల కోసం మూడు పోలీసు బృందాల గాలింపు
యమునా నదిలో స్నానం చేస్తుండగా కొందరు వ్యక్తులు రహస్యంగా వీడియో తీయడంతో మనస్తాపానికి గురైన ఇద్దరు టీనేజ్ అమ్మాయిలు ఆత్మహత్యకు యత్నించారు. ఉత్తరప్రదేశ్లోని చిత్రకూట్ జిల్లాలో శుక్రవారం జరిగిన ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది.
16, 17 ఏళ్ల వయసున్న ఇద్దరు బాలికలు విషం సేవించారని స్థానిక కమ్యూనిటీ హెల్త్ సెంటర్ (CHC) నుంచి సమాచారం అందినట్లు జిల్లా ఎస్పీ అరుణ్ కుమార్ సింగ్ తెలిపారు. పోలీసులు అక్కడికి చేరుకునేలోపే వారిని మెరుగైన చికిత్స కోసం మొదట కార్విలోని జిల్లా ఆసుపత్రికి, ఆ తర్వాత బాందాలోని రాణి దుర్గావతి మెడికల్ కాలేజీకి తరలించారు.
ఆసుపత్రికి తరలిస్తుండగా బాలికలు పోలీసులతో తమ ఆవేదనను పంచుకున్నారు. గురువారం తాము యమునా నదిలో స్నానం చేస్తుండగా కొందరు వ్యక్తులు తమ ఫోటోలు, వీడియోలు తీశారని చెప్పారు. ఈ విషయం ఇంట్లో తెలియడంతో కుటుంబ సభ్యులు తమను మందలించారని, దీంతో తీవ్ర మనస్తాపానికి గురై విషం తాగినట్టు వివరించారు.
ఈ ఘటనపై విచారణ చేపట్టేందుకు మూడు ప్రత్యేక పోలీస్ బృందాలను ఏర్పాటు చేసినట్లు ఎస్పీ అరుణ్ కుమార్ సింగ్ వెల్లడించారు. ఒక బృందం బాలికల చికిత్సను పర్యవేక్షిస్తుండగా, రెండో బృందం కుటుంబ సభ్యులతో సమన్వయం చేసుకుంటోందని తెలిపారు. మూడో బృందం వీడియోలు తీసిన నిందితుల కోసం గాలిస్తోందని ఆయన పేర్కొన్నారు.